అమరావతి కట్టడం సాధ్యమా? కామెంట్ చేయండి
AP: మాజీ సీఎం జగన్ ప్లాన్-బిగా కొత్త రాజధానిని ప్రకటించారు. మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు)ను కలిపి అభివృద్ధి చేయాలన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయల కోసమే రూ.2లక్షల కోట్లు ఖర్చు చేయడమేంటని ప్రశ్నించారు. అమరావతి కట్టడం సాధ్యం కాదని మరోసారి నొక్కి చెప్పారు. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారన్నారు. మరి నిజంగానే అమరావతి కట్టడం సాధ్యం కాదా? మీరేమంటారు?