కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే హక్కు లేదు: బీజేపీ
GDWL: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గట్టు మండలం చాగదోన గ్రామంలో వీర శేఖర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులే గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత టీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదన్నారు.