TSUTF ఆధ్వర్యంలో TET పై అవగాహన సదస్సు
KMM: మధిర పట్టణంలోని TSUTF ప్రాంతీయ కార్యాలయంలో గురువారం టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్(TET)పై ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్రం విద్యా హక్కు చట్టం లోని 23ను సవరించి సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి అన్నారు. TET పై నిర్వహించే అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు.