మిడ్ మానేరుకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

SRCL: శ్రీరాజరాజేశ్వర జలాశయానికి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటితో పాటు, మూలవాగు, మానేరు ద్వారా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం వరకు 17152 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 13802, గాయత్రి పంప్ హౌస్ నుంచి 3150, మూలవాగు, మానేరువాగు ద్వారా 200 క్యూసె క్కుల నీరు వచ్చి చేరుతుంది.