'ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'

SDPT: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ ఏసీపీ కే.నర్సింలు సూచించారు. వర్గల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్ చెరువు నిండి పొంగి పొర్లుతూ వర్షం నీరు ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న ప్రదేశాన్ని గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా కోన్స్, రెండు వైపులా రోప్ కట్టడం జరిగింది.