రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థులకు గాయాలు

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కావలి రూరల్ మండలం పెద్ద పట్టపు పాలెం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాను, బైకు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరూ పదో తరగతి విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలియజేశారు. కాగా పరీక్ష రాసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.