అందెశ్రీ పార్థివ దేహానికి పలువురు నివాళులు

అందెశ్రీ పార్థివ దేహానికి పలువురు నివాళులు

HYD: ప్రముఖ కవి గాయకుడు అందెశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. ఇవాళ లాలాపేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో ఉంచిన అందెశ్రీ పార్థివదేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి అందెశ్రీకి నివాళులు అర్పించారు. అనంతరం అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.