మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించాలి
AKP: మరుగుదొడ్ల వినియోగంపై గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. శుక్రవారం అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం గోడ పత్రికను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమాన్ని నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను వాడుకలోకి తీసుకురావాలన్నారు.