'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని టీడీపీ జిల్లా అధ్యక్షులు రమేష్ అన్నారు. ఆమదాలవలసలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు నుంచి పలు సమస్యల పై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు. వినతులను పరిష్కరిస్తామని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు.