'యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం'

'యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం'

NDL: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా యూరియాను అందించాలని సీపీఎం పార్టీ నాయకులు పి. పక్కిరి సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నంది కోట్కూరులోని మార్కెటింగ్ యార్డులో ఉన్న డీసీఎంఎస్ ద్వారా రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతుల రమణ, శ్రీరాములు, మద్ది లేటి, తదితరులు పాల్గొన్నారు.