VIDEO: అడెల్లి పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
NRML: సారంగాపూర్ మండలంలోని ప్రఖ్యాత శ్రీ అడెల్లి మహా పోచమ్మ దేవాలయంలో ఆదివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. జిల్లాలోని పలు మండలాల నుంచే కాకుండా, సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి తమ మొక్కులను చెల్లించారు. పలువురు భక్తులు బోనాలు సమర్పించారు. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వచ్చారు.