ఊపు అంతా ఉప సర్పంచ్ వైపే...!
TG: గ్రామీణ రాజకీయాల్లో ఫోకస్ అంతా ఉప సర్పంచ్ కుర్చీపై ఉంది. సర్పంచ్ పోస్టుకు రిజర్వేషన్ కలిసిరాకపోవడం, ఎక్కువ మొత్తంలో మహిళలకు రిజర్వ్ కావడంతో చాలామంది నేతల రాజకీయ లెక్కలు తారుమారయ్యాయి. దీంతో వార్డు నుంచి పోటీ చేసి ఉప సర్పంచ్‌గా చక్రం తిప్పాలనే పోటీతత్వం పెరిగింది. పదవి చిన్నదైనా నిధులపై సర్పంచ్‌తో పాటు జాయింట్ పవర్ ఉండటంతో ఉప సర్పంచ్ పదవి కీలకంగా మారింది.