సంపూర్ణత అభియాన్‌లో జిల్లాకు అత్యుత్తమ పురస్కారం

సంపూర్ణత అభియాన్‌లో జిల్లాకు అత్యుత్తమ పురస్కారం

ASF: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహణలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అత్యుత్తమంగా నిలిచింది. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో సంపూర్ణత అభియాన్‌లో అత్యుత్తమ సేవలు అందించిన నేపథ్యంలో జిల్లాకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పురస్కారం పొందారు.