రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

MLG: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడ్వాయి- పస్రా మధ్య బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆటోను క్రాస్ చేయబోయి ప్రమాదవశాత్తు కిందడిపోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఓ వ్యక్తి తలపై నుంచి పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు. మృతుడు అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి ఏపీలొని గుంటూరు జిల్లాకు చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.