VIDEO: పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 19, 22, 36 డివిజన్లలో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్‌లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. డ్రైన్ టు రోడ్ విధానంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.