కారు, బస్సు ఢీ.. ఒకరు మృతి

కారు, బస్సు ఢీ.. ఒకరు మృతి

KNR: మండలంలోని ఇందిరానగర్ గ్రామ రాజీవ్ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కొంగారి మృత్యుంజయ్(32) మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మృత్యుంజయ్ కుటుంబసభ్యులతో కలిసి కారులో కరీంనగర్ వచ్చి సాయంత్రం హైదరాబాద్ బయలుదేరాడు. కారు డివైడర్‌ను తాకి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.