అర్చకుడికి లేఖ.. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే

అర్చకుడికి లేఖ.. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే

ATP: మురడి ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు ఆనంతశయనకు ఇచ్చిన లేఖపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టతనిచ్చారు. అర్చకుడు, అతని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే 5 నెలల క్రితం మానవతా దృక్పథంతో లేఖ ఇచ్చానని వివరించారు. ప్రజా ప్రతినిధిగా తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యక్తిగతంగా బాధ కలిగిందని, భవిష్యత్తులో ఆలయాల పరిరక్షణకు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని అన్నారు.