గాంధీ విగ్రహానికి ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

గాంధీ విగ్రహానికి ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

NZB: పొతంగల్ మండలం జల్లపల్లి గ్రామానికి చెందిన సంతోష్ (35) శుక్రవారం రాత్రి గ్రామంలోని గాంధీ విగ్రహానికి తన చొక్కాతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోటగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలియాల్సి ఉంది.