మరో రౌడీ షీటర్‌పై PD యాక్ట్ నమోదు
నెల్లూరు వేదయపాలెంలో రౌడీ షీటర్ చింతల భూపతిపై పోలీసులు PD యాక్ట్ అమలు చేశారు. SP అజిత వేజెండ్ల సూచనలపై అతడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 మంది రౌడీ షీటర్లపై PD యాక్ట్ అమలు చేసి జైలుకు పంపినట్లు CI K. శ్రీనివాసరావు తెలిపారు. ఈ చర్యలతో ప్రాంత ప్రజల్లో భద్రతా ధృక్పథం పెరిగిందని చెప్పారు.