ఈ నెల 21, 22 తేదీల్లో సదరం క్యాంపులు

ఈ నెల 21, 22 తేదీల్లో సదరం క్యాంపులు

CTR : సీఎం చంద్రబాబు ఆదేశాలతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 21, 22 తేదీల్లో ప్రత్యేక సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంలోని వికలాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు నేరుగా సదరం క్యాంపుకు హాజరై పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు.