జిల్లాలో రేపు జాబ్ మేళా
SKLM: జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000- 25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు.