'వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి'
PDPL: ఎండలు పెరిగిన దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు వహించాలని DMHO డా. ప్రమోద్ కుమార్ తెలిపారు. మ. 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగవద్దని, నీరు, మజ్జిగ వంటి పానీయాలు తాగాలని తెలిపారు. తేలికపాటి పలుచని, లేత రంగు దుస్తులు ధరించాలన్నారు. పిల్లలు వృద్దులు గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని, ఎండలో ఎక్కువ సేపు పనిచేయకుండా మధ్యలో విరామం తీసుకోవాలన్నారు.