నేపాల్ నుంచి జిల్లాకు నేడు యాత్రికులు

నేపాల్ నుంచి జిల్లాకు నేడు యాత్రికులు

VZM: నేపాల్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లి చిక్కుకున్న 61 మంది యాత్రికులను రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్‌ అంబేద్కర్ తెలిపారు. ఈ మేరకు ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ జిల్లాకు చేరుకోనున్నారని బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ కోరారు.