భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు: YV సుబ్బారెడ్డి
AP: కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారయ్యాయని.. దుష్ప్రచారం చేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరిగితే బాగుంటుంది. ల్యాబ్ నివేదిక లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు' అని ఆరోపించారు.