'బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహిద్దాం'
MBNR: ఈనెల 15వ తేదీ వరకు 'బిర్సా ముండా జయంతి' సందర్భంగా జన జాతి గౌరవ దివస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఇవాళ పిలుపునిచ్చారు. ఈ కాలంలో ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించాలని అన్నారు. జయంతి సందర్భంగా గిరిజన మహోత్సవం వ్యాసరచన పోటీలు ఆరోగ్య శిబిరం, క్విజ్ పోటీ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.