'భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే'

BDK: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన ఈర్ల నాగేష్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య భూమి పూజ చేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం రోళ్లపాడు చెరువు కుడి ఎడమ కాలువలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.