గొర్రెలపై దూసుకు వచ్చిన వ్యాన్.. యజమానికి నష్టం

గొర్రెలపై దూసుకు వచ్చిన వ్యాన్.. యజమానికి నష్టం

BDK: మణుగూరు ప్రాంతంలో విషాదకర ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఎస్పీ సమీపంలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రోడ్డుపై గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ అదుపుతప్పి గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటన తనను తీవ్రంగా నష్టపరిచిందని యజమాని తెలిపారు.