రెడ్డిగూడెంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం
ఎన్టీఆర్: రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభించారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ హెచ్‌పీవీ టీకా ఎంతగానో ఉపయోగపడుతుందని పీహెచ్సీ డాక్టర్ మణిబాబు తెలిపారు. 14 సంవత్సరాలు నిండి, 15 సంవత్సరాల లోపు బాలికలకు ఈ టీకాలను ఉచితంగా ప్రతి ప్రాథమిక, సామాజిక, ఆరోగ్య కేంద్రాలలో వేస్తున్నామన్నారు.