'ఈనెల 20 లోపు B.Ed సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లించాలి'
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని B.Ed 1, 3వ రెగ్యులర్ సెమిస్టర్ల విద్యార్థులు పరీక్షల ఫీజును చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్కులర్ జారీ చేశారు. ఈనెల 20వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.