VIDEO: నిండు కలశాలతో స్వామి వారి ఊరేగింపు
SRD: సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు నిండు కలశాలతో ఊరేగింపు, పల్లకి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం నుంచి స్థానిక హనుమాన్, రుక్మిణి సమేత పాండురంగ మందిరంలో అఖండ హరినామ సప్తహం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సాంప్రదాయ ప్రకారం విఠలేశ్వర స్వామి పల్లకి సేవ, నిండు కలశాలతో శోభయాత్ర నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు.