కేరళ సంప్రదాయ డ్రమ్‌ను వాయించిన మోదీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలక్కాడ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తల కోరిక మేరకు కేరళకు ప్రసిద్ధ డ్రమ్ అయిన చెండాను వాయించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.