ట్రంప్ చిత్రంతో బంగారు స్మారక నాణెం!
అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా రూపొందించనున్న స్మారక నాణెంపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చిత్రం కనిపించనున్నట్లు తెలుస్తోంది. 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయనున్న ఈ నాణెంపై.. ఓవల్ ఆఫీస్‌లోని రెజల్యూట్ డెస్క్‌పై చేతులు పెట్టిన పోజులో ఉన్న ట్రంప్ చిత్రాన్ని ముద్రించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.