ఆధార్ అప్డేట్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం
కోనసీమ: ఆధార్ అప్డేట్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఆయన జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలలో చదువుతున్న 5 నుండి 17 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థుల ఆధార్ కార్డులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ బయోమెట్రిక్ ఆధార్ అప్డేట్ విద్యార్థులందరూ చేసుకోవాలన్నారు.