పాలమూరు యూనివర్సిటీ పరిధిలో వేసవి సెలవులు ప్రకటన

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని పీజీ కళాశాలలకు విశ్వవిద్యాలయ అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు మే 1 నుంచి జూన్ 4 వరకు ఉంటాయన్నారు. జూన్ 5న కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ఈ సెలవులు పాలమూరు విశ్వవిద్యాలయంతో పాటు పీజీ సెంటర్స్, పీజీ కళాశాలలకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.