భార్య హత్య కేసులో భర్తకు రిమాండ్
KDP: ప్రొద్దుటూరులోని బొల్లవరంలో ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గౌరు సుజాత కేసులో 3టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా గురువారం మృతురాలి భర్త రవిశంకర్ రెడ్డిని సీఐ వేణుగోపాల్ అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతన్ని రిమాండ్కు పంపింది.