నేడు దేవాలయ పాలకమండలికి దరఖాస్తుల పరిశీలన

నేడు దేవాలయ పాలకమండలికి దరఖాస్తుల పరిశీలన

TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పళ్లికొండేశ్వర స్వామి ఆలయ నూతన పాలకమండలి నియామకానికి 98 మంది దరఖాస్తు చేసుకున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను గురువారం ఉదయం 9 గంటల నుంచి పరిశీలిస్తామని ఆలయ ఈవో లత తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, అఫిడవిట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో-1 తప్పక తీసుకురావాలన్నారు.