సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: SP
ADB: ప్రజా ఫిర్యాదుల పట్ల బాధ్యత యుతంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించేలా కృషి చేయాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.