నిత్యపూజయ్య ఆలయ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం
KDP: సిద్ధవటంలోని స్థానిక రంగనాధ స్వామి ఆలయంలో గురువారం నిత్యపూజ ఆలయ ఛైర్మన్‌గా జంగిటి రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పాలకవర్గ సభ్యులతోనూ ఆలయ ఇంఛార్జ్ శ్రీధర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఆయనకు ఈవో శ్రీధర్ శాలువా కప్పి సన్మానించారు.