రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌కు గాయాలు

BDK: అశ్వాపురం మండల పరిధిలోని గోపాలపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న ఆటో ట్రాలీ, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి గాయపడగా బాధితుడు మణుగూరు ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న మహేష్‌గా గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.