'గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి రావొద్దు'

BDK: గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు దర్శించుకోవద్దని ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది ఇవాళ విజ్ఞప్తి చేశారు. అశ్వరావుపేట సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయానికి భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు రావద్దని తెలిపారు. వరద తగ్గేవరకు ఆలయ వద్దకు భక్తులు రాకుండా సహకరించాలని కోరారు.