లిక్కర్ కేసు.. ముగ్గురికి ఈడీ నోటీసులు
AP: లిక్కర్ కేసులో మరో ముగ్గురికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ధనుంజయరెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యకు నోటీసులు ఇచ్చారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో హాజరుకావాలని ఈడీ సూచించింది. త్వరలో మరికొందరికి నోటీసులు ఇవ్వనుంది.