విజయ్‌కు పోలీసులు షాక్
రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్న TVK అధినేత విజయ్‌కు తమిళనాడు పోలీసులు షాక్ ఇచ్చారు. భద్రతా కారణాల వల్ల డిసెంబర్ 4న సెలంలో జరిగాల్సిన కార్యక్రమానికి అనుమతిని నిరాకరించారు. ప్రచారానికి ఎంతమంది హజరవుతారో స్పష్టంగా వివరాలు ఇవ్వకపోవడంతోనే నిరాకరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ సమావేశాలకు 4 వారాల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.