VIDEO: యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా

BDK: ఇల్లందులో యూరియా కోసం రైతులు గురువారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తక్షణమే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని నినాదాలు చేశారు. యూరియా కొరతతో తీవ్రంగా నష్టపోతున్నామని, సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని సర్దిచెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.