VIDEO: కోసూరులో దొంగల హల్‌చల్

కృష్ణా: మొవ్వ మండలం కోసూరులో దొంగల హల్‌చల్ కలకలం రేపింది. అర్ధరాత్రి నాలుగు దేవాలయాల తాళాలు పగులగొట్టి దుండగులు చోరీలు చేశారు. రామాలయం, వేణుగోపాల స్వామి దేవాలయాల నుంచి రూ.5 లక్షల విలువైన నాలుగు కేజీల వెండి కిరీటాలు, చటారాలు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గంగానమ్మ, వినాయక ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు దోచుకుపోయారు. పోలీసులు CC కెమెరాలను పరిశీలిస్తున్నారు.