VIDEO: ఆదేశాలు భేఖాతర్.. వంతెనపై రాకపోకలు
E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో ప్రమాదకరంగా ఉన్న ఇరుకు వంతెనపై భారీ వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన.. అధిక లోడు లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. కానీ పగలు రాత్రి తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.