రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
TG: ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ఆర్ఆర్ఆర్ మంజూరు అయిందన్నారు. తానే స్వయంగా మోదీని కలిసి RRRను మంజూరు చేయించానని తెలిపారు. హైడ్రా న్యాయం వైపు ఉంటే.. ఎంఐఎం కాలేజీలను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు.