ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం: కలెక్టర్
NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.