మహిళ అదృశ్యం.. కేసు నమోదు

మహిళ అదృశ్యం.. కేసు నమోదు

నాగర్ కర్నూల్: అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలో మహిళ అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తచెరువు తండాకు చెందిన ఆరెకంటి లక్ష్మి ఈనెల 12వ తేదీన భర్తతో గొడవ పడి,అదే రోజు సాయంత్రం నుంచి తన భార్య కనిపించడం లేదని భర్త కుర్మయ్య ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.