గాంధీ గుడిలో అక్షయపాత్ర గురించి తెలుసా..?
NLG: హైదరాబాద్ - విజయవాడ రోడ్డుపై చిట్యాల శివారులోని గాంధీ గుడి సేవా కేంద్రంగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన అక్షయపాత్రలో దాతలు వాడని దుస్తులు ఉంచుతుండగా, పేదలు ఉచితంగా తీసుకెళ్తున్నారు. అన్ని వయసుల దుస్తులు అందుబాటులో ఉండడంతో ఇది పలువురికి ఉపయోగకరంగా మారింది. తెలియని వారు ఈ సేవను వినియోగించుకోవాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.