ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని గుజరాత్‌కు చెందిన టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో బస్సలో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా, బస్సు విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.